ఆగస్టులోగా రుణమాఫీ చేస్తాం

83చూసినవారు
ఆగస్టులో పంట రుణమాఫీ చేస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఉదయం జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పంట రుణమాఫీని చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నికలు పూర్తయిన తర్వాత పంట రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్