కుబీర్ మండలం బ్రహ్మేశ్వర్ తండాలో అనారోగ్యంతో చనిపోయిన ఎద్దుకు గ్రామంలో డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, భజనలతో అంత్యక్రియలు జరిపారు. తమ గ్రామంలో చనిపోయిన బసవన్న ఎద్దు కాదని తమ ఆరాధ్య దైవమని అన్నారు. అలాంటి బసవన్న తమకు దూరం కావటం తట్టుకోలేక పోతున్నామని కన్నీరు మున్నీరుగా విలపించారు.