బైంసాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు మూడు లక్షల రూపాయల విలువగల చెక్కులను అందించారు. చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.