భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. గురువారం సీసీఐ పత్తి ధర రూ. 7, 471 గా, ప్రైవేటు పత్తి ధర రూ. 7, 000 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. మంగళవారం ధరలతో పోలిస్తే సీసీఐలో రూ. 50 తగ్గిందని, ప్రైవేటులో ఎలాంటి మార్పులేదన్నారు. కనీస ధర 10 వేలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.