శోభా యాత్రను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

58చూసినవారు
ముథోల్ మండల కేంద్రంలో శుక్రవారం గణేష్ నిమజ్జనం శోభా యాత్ర ఘనంగా ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తో కలిసి సార్వజనిక్ గణేష్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభా యాత్రను ప్రారంభించారు. శోభ యాత్రను శాంతి యుతంగా జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్