దుర్గా ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని హిందూ, ముస్లిం మత పెద్దలకు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు. సోమవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమవేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి యుతంగా జరుపుకోవాలి కోరారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పట్టణ సిఐ గోపీనాథ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.