ఘనంగా మీరాతాయి అంబేద్కర్ జన్మదిన వేడుకలు

65చూసినవారు
భైంసా పట్టణంలోని ఏపీ నగర్, రాహుల్ నగర్ మైత్రేయ బుద్ధ విహార్ లో ఆదివారం ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భైంసా శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త డా. బాబాసాహెబ్ అంబేద్కర్ కోడలు మహా ఉపాసిక మీరాతాయి అంబేద్కర్ 89 వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సంరక్షకురాలుగా చేసిన సేవలను కొనియాడారు. ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్