అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

65చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దమని పవర్ ఆఫ్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సతీష్ అన్నారు. సోమవారం బాసర మండలం బిద్రేల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల వ్యవస్థను రూపుమాపి అందరూ సమానమే లక్ష్యంగా ఆయన పోరాటం చేశారని అన్నారు.
ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్