ప్రమాదవశాత్తు వాగులో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన పడాల నర్సయ్య (42) అనే వక్తి మండలంలోని కనకపూర్ గ్రామ శివారులోని వాగులో పంపు మోటార్ దించుతుండగా ప్రమాదవశత్తు నీట మునిగి మృతి చెందినట్లు తెలిపారు. మృతని భార్య పడాల సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.