నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ వైదిక బృందం, దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక అక్షరాభ్యాసం మండపంలో కుంకుమార్చన పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా జిల్లా కలెక్టర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.