బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో రాత్రి అమ్మవారి ఆలయంలో శ్రీ దత్తాత్రేయ అనుబంధ ఆలయంతో పాటు లడ్డు ప్రసాదం కౌంటర్లలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడిన ఘటనపై గురువారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు.