నిర్మల్ జిల్లా తానూర్ ప్రాథమిక సహకార సంఘంలో రైతులకు యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రాథమిక సహకార సంఘం సీఈఓ భూమయ్య శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. బస్తా ధర రూ. 267 ఉందని అవసరమైన రైతులు ఆధార్ కార్డు, పట్టా పాసు బుక్కు జిరాక్స్ తీసుకొని వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. రైతులు ఎరువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.