అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్

77చూసినవారు
అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్
లోకేశ్వరం మండలం భామ్ని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం తహసీల్దార్ మోతిరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి సెంటర్ లో స్టాక్ వివరాలు, రికార్డులు కేంద్రానికి వచ్చే చిన్నారుల, బాలింతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పిల్లల హాజరు శాతం పెంచాలని, వారికి నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లలిత, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఫర్హాన ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్