సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటి ఆవరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ సూచించారు. శుక్రవారం ముధోల్ మండలం తారోడా గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డుల్లో పర్యటించి నిరుపయోగ వస్తువుల్లో, టైర్లు, పాత కుండలలో నిల్వ ఉన్న నీటిని సిబ్బందితో పారబోయించారు. ఇంటి పరిసరాల్లో మురుగు గుంతలు లేకుండా చూసుకోవాలన్నారు. పంచాయితీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.