ఆర్టీసీ బస్సులో చోరీ

75చూసినవారు
ఆర్టీసీ బస్సులో చోరీ
బాసర నుండి బైంసా వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సులో సోమవారం గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్సులో ముగ్గురి విలువైన సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. బస్సును స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు క్షుణ్ణంగా బస్సును తనిఖీ చేసి ప్రయాణికుల నుండి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్