ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకునేది లేదు

545చూసినవారు
ఎమ్మెల్యే రామారావు పటేల్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పై తానూర్ మండల బిజెపి అధ్యక్షులు చిన్నరెడ్డి మండిపడ్డారు. బుధవారం బైంసా పట్టణంలోని మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే సాగునీటి రంగంపై నిర్లక్ష్యం చేయడం వల్లే నియోజకవర్గంలో రైతాంగం వెనుకబడిందన్నారు. గడ్డెనవాగు ప్రాజెక్టు నిర్మించి 20 సంవత్సరాలైనా ప్రధాన కాలువ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్