రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల రాస్తారోకో

56చూసినవారు
బైంసా మండలం ఖత్గాం గ్రామ ప్రజలు శుక్రవారం భైంసా పట్టణంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. భైంసా పట్టణం నుండి తమ గ్రామానికి రోడ్డు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు, నాయకులకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని వాపోయారు. వర్షాకాలం వస్తే చాలు రోడ్లన్నీ బురదమయమై పట్టణానికి రావడానికి అవస్థలు పడుతున్నామని అన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్