బీహార్ సీఎం పదవిలో కొనసాగేందుకు ప్రధాని మోడీ కాళ్లను నితీష్ కుమార్ తాకారని మాజీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ‘జన్ సురాజ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భాగల్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. మోడీ కాళ్లను తాకి బీహార్‌కు నితీష్ తీరని అవమానం తెచ్చారని అన్నారు. కేంద్రంలో NDA ప్రభుత్వానికి JD(U) అవసరం ఉందని, దానిని రాష్ట్రం కోసం నితీష్ వినియోగించడం లేదన్నారు.