డొంకేశ్వర్ మండలం సీహెచ్ కొండూర్ అడవి ప్రాంతంలో ఇటీవల పులి సంచరిస్తుంది అని పలువురు గ్రామ ప్రజలు మరియు సోషల్ మీడియాలో తెలుపడంతో అటవీ అధికారులు జంతువును గుర్తించడానికి బుధవారం అధునాతనమైన కెమెరాలను బిగించడం జరిగింది. వాటి కదలికలు కెమెరాలో ఆటోమేటిక్ గా బంధించడం జరుగుతుందని, అడవిలోకి ఒంటరిగా వెళ్లకూడదని, అడవి జంతువులకు ఎటువంటి ప్రాణహాని చేయరాదని నందిపెట్ మండల ఫారెస్ట్ అధికారి సుధాకర్ తెలిపారు.