ఆలూరు మండలం దేగాం గ్రామంలో ఆదివారం కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. దీంతో క్షతగాత్రులను ఆర్మూర్ పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నుంచి చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు వెల్లడించారు.