108 అంబులెన్స్ లో ఓ గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాల్కొండ మండలం ఇత్వార్ పేట్ ఇటుక బట్టికి చెందిన లావణ్య మంగళవారం సాయంత్రం పురిటి నొప్పులు రావడంతో 108 కు కుటుంబ సభ్యులు కాల్ చేశారు. మధ్యమార్గంలో పురిటి నొప్పులు మరింత ఎక్కువ అవడంతో సిబ్బంది, అంబులెన్స్ లోనే చికిత్స చేసి బిడ్డకు పురుడు పోశామని EMT శాంత, పైలెట్ శ్రీనివాస్, ఆశ వర్కర్ సుజాత లు తెలిపారు.