ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ గిరిబాబు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.