బోధన్ ఉషోదయ జూనియర్ కళాశాలలో ఆదివారంపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది. ఆ కళాశాలలో 2008-10 సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుని ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఆయా రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అప్పుడువరికి పాఠాలు బోధించిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు.