రతన్ టాటా జన్మదినం సందర్భంగా, టాటా ఏఐఏ ఉద్యోగులు నందిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రతన్ టాటా దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోతుల రమేష్, రవీందర్, మాధవ్, అనిల్, నవీన్, పవన్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.