ఆలూర్ మండలానికి నూతనంగా అంబులెన్స్ మంజూరు కాగా సోమవారం ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి అంబులెన్స్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవలకు అంబులెన్స్ ను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. నూతన అంబులెన్స్ మంజూరు కావడంతో ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.