జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరులో శుక్రవారం సావిత్రి బాయి పూలే జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారం మండల విద్యాధికారి ఎం నరేందర్ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయినిలను ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షులు సాయన్న, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుంట శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ ఆశ్ఫక్ అహ్మద్, రామచందర్ విద్యార్థులు పాల్గొన్నారు.