పట్టభద్రుల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటునందిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ తెలిపారు. ప్రచారంలో భాగంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులను కలిసిరాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, ప్రభుత్వ ప్లీడరు వెంకట రమణ గౌడ్, న్యాయవాదులు జగదీశ్వర్ రావు, కృష్ణా నంద్, రాజ్ కుమార్ సుబేదార్, జైపాల్ పాల్గొన్నారు.