ఆలూర్ మండల కేంద్రంలో సన్న బియ్యం ప్రారంభం

83చూసినవారు
ఆలూర్ మండల కేంద్రంలో సన్న బియ్యం ప్రారంభం
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో మంగళవారం సన్న బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రేషన్ షాప్ వద్ద సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందించారు. ఆలూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కెర విజయ మాట్లాడుతూ ఉగాది నుండి సన్నబియ్యం ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇచ్చారని, అన్నమాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్