యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా వేల్పూర్ మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవల ఫలితాల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించిన ఓటింగ్ లో తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రచారం చేసి పార్టీ బలోపేతం కొరకు తనవంతు కృషి చేస్తానని శనివారం తెలిపారు.