వదినను కత్తితో పొడిచి చంపిన మరిది
భిక్కనూరు మండలం భాగిర్తీపల్లి గ్రామానికి చెందిన రాములు భార్య లావణ్యకు, అతని తమ్ముడు సురేష్ కు భూమి విషయంలో తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొంత భూమి అమ్మి వైద్యం చేపించాలి అని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శనివారం ఉదయం మరోసారి అడిగటంతో మల్లి గొడవ జరిగింది.కోపోద్రుక్తుడైన సురేష్ కత్తితో లావణ్యను పొడిచి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.