ఎడపల్లి మండలంలోని మంగల్ పాడ్ చౌరస్తా వివేకానంద విగ్రహం మూడు కూడలి వద్ద రోడ్డు మొత్తం కంకర తెలిపోవడంతో రోడ్డు అంత గుంతలు గుంతలు మయంగా ఏర్పడింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో రోడ్డుపై ఉన్న గుంతలు కనపడక గతంలో ప్రమాదాలు కూడా జరిగాయి కానీ, అధికారులు చూసి చూడనట్లు గానే వ్యవహరిస్తున్నారు. ఇది ఇలాగే ఉంటే ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో తెలియదు. అధికారులు ఎన్ని సార్లు మొర పెట్టిన పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. రోడ్డు రవాణా శాఖ అధికారులు సమస్యలని పట్టించుకోని వెంటనే రోడ్డు పై ఉన్న గుంతలు పూడ్చి తారు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.