బోధన్: ఆదివారం జోరుగా ఇసుక డంప్

70చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కండ్గావ్ మంజీరాలలో జోరుగా ఇసుక డంప్ చేస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ సెలవు కావడంతో ఇసుకాసురులకు పండగ వాతావరణం నెలకొంది. ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ఇసుక డంప్ చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్