జాతీయ రహదారి మహోత్సవాలలో భాగంగా బోధన్ పట్టణంలోని లయోల పాఠశాలలో గురువారం రోడ్డు ప్రమాదలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్ వి ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. సంవత్సరానికి 6 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో మరనిస్తున్నారని అన్నారు.