బోధన్ మండలం అందాపూర్ గ్రామ శివారులో మొరం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గురువారం ప్రభుత్వ సెలవు రోజు అయినప్పటికీ జేసీబీలతో మొరం తవ్వకాలు చేపట్టారు. టిప్పర్లలో బోధన్ పట్టణ శివారులోని వెంచర్లకు మొరం తరలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా రవాణా జరుపుతున్నారు.