బోధన్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా బుధవారం గంగోని యగ్నేష్ ఎన్నికయ్యారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన ఓటింగ్ లో యగ్నేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా యగ్నేష్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ను గ్రామ గ్రామాన పటిష్టం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాలలో వివరిస్తానని అన్నారు.