బోధన్ మండలం జానకంపేట గ్రామానికి చెందిన మహేష్ అనే అతను శనివారం పోలీస్ స్టేషన్ కి వచ్చి సీటీసీ ముందున్న చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉందని సమాచారం ఇచ్చినట్లు ఎస్సై వంశీ చందర్ రెడ్డి తెలిపారు. మృతురాలి వయస్సు దాదాపు 55 నుండి 60 ఏళ్ళ మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు పోలీసుస్టేషన్ లో సంప్రదించాలని ఎస్సై తెలిపారు.