కెసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి తన బిడ్డలైన తనపై రామన్నపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ పట్టణానికి జైలు నుండి వచ్చిన తర్వాత మొదటిసారి హాజరైన సందర్భంగా కార్యకర్తలు బ్యాండ్ బాజాలతో ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు శాఖను కీలు బొమ్మలాగా వాడుకుంటున్నారన్నారు.