చందూరు మండల కేంద్రంలో శివాలయం ఆవరణలో ఉన్నటువంటి ఓ మామిడి చెట్టుకు పూత విపరీతంగా పూసింది. ఈ పూత పూయడంతో చూసిన వారంతా పూల చెట్టా మామిడి చెట్టా అని వింతగా చూస్తున్నారు. చెట్టుకు ఆకులు కనపడడంతో మామిడి పూత పూయడంతో పూల చెట్టా మామిడి చెట్టా అని దగ్గరికి వెళ్లి చూస్తే మామిడి చెట్టు అని తెలుస్తుంది. ఈసారి మామిడి చెట్లకు ఇంత పూత పూయడం ఇదే మొదటి సారి అని గ్రామస్తులు తెలుపుతున్నారు.