చండూరు మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో ఆకతాయిలు బైక్ పై తిరుగుతూ సైలెన్సర్లు విప్పి సౌండ్ చేయకుండా, రోడ్లపై మద్యం సేవిస్తూ తిరగకుండా, అసంఘటిత కార్యక్రమాలకు చెక్ పెట్టినట్టయ్యింది. ఈ సీసీ కెమెరాలు వర్ని పోలీస్ స్టేషన్ టీవీలకు అనుసంధానం చేయడంతో ప్రశాంత వాతావరణం నెలకొన్నదని గ్రామస్తులు తెలిపారు.