విద్యార్థులకు ఏకరూప దుస్తువుల పంపిణీ

67చూసినవారు
విద్యార్థులకు ఏకరూప దుస్తువుల పంపిణీ
నవీపేట్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, శివతాండ మరియు నాగేపూర్ పాఠశాలలో సోమవారం డిఆర్డిఎ అధికారి సాయి గౌడ్ ఏకరూప దుస్తువులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సహకారంతో తయారవుతున్న ఏకరూప దుస్తులు సకాలంలో పాఠశాల విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు. ఏపిఎం భూమేష్ గౌడ్, మహిళ సమాఖ్య నాయకురాలు ఉషారాణి, సిఏలు, మహిళ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్