రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కళాశాల ఆవరణలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ డి.కల్పన, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.