నవీపేట్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద గురువారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అటువైపుగా వస్తున్న ట్రైన్ కు ఎదురుగా బైక్ పై ఆ యువకుడు వేగంగా వెళ్లాడు. గమనించిన ట్రైన్ పైలెట్ ట్రైన్ ను నిలిపివేసి రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ యువకుడుని రైల్వే పోలీసులు నిజామాబాద్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.