
నిజామాబాద్: ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
దుబ్బాక గ్రామానికి చెందిన బొల్లారం సాయిలు అనే వ్యక్తి శనివారం యూరియా కోసం ట్రాక్టర్ పై ధర్పల్లి వెళ్తూ గ్రామ శివారులోని పసుపు పరిశోధనా కేంద్రం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు