సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని లేఖలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కచ్చ గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమికి కాంగ్రెస్ ప్రభుత్వం వేలంపాట నిర్వహించడానికి చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో ఆ భూమి వేలం పాట నిర్వహణపై కేంద్ర మంత్రి అభ్యంతరం తెలిపారు. వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయొద్దని సూచించారు.