తెలంగాణ శాసనసభ సమావేశాలు 12వరోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సర్కారు రైతు రుణమాఫీ చేయాలని మండలి ఆవరణలో BRS MLCలు గురువారం నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రైతు రుణమాఫీ బోగస్ అంటూ నినాదాలు చేశారు. పాముకాట్లు, ఎలుక కాట్లు, విషాహారంతో వందలాది మంది విద్యార్థులు బలి అవుతున్నారని, రోజుకో పేపర్ లీక్ లతో విద్యార్థులు ఆగమవుతుంటే కాంగ్రెస్ సర్కార్ సోయి లేక నిద్రమత్తులో ఉందని ఆరోపించింది