ఉగాదికి సన్నబియ్యం.. స్మగ్లర్ల కలలు: ఎమ్మెల్యే (వీడియో)

85చూసినవారు
తెలంగాణలో ఉగాది పండుగ నుంచి రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో BJP MLA పైడి రాకేశ్ రెడ్డి అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు. 'ఉగాది సమయంలో సన్నబియ్యం పథకం ద్వారా రూపాయికి ఇచ్చే బియ్యాన్ని స్మగ్లర్లు రూ.40కి అమ్మే కలలు కంటున్నారు. ఆకలితో ఉన్నవారికే బియ్యం ఇవ్వాలి.. అమ్ముకునే వారికి ఇవ్వొద్దు. దీనిపై వేల కోట్ల దందా, రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్