ఇంటింటా బతుకమ్మ సంబరాలు
డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో ఇంటింటా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. దసరా సెలవులు రావడంతో చిన్నారులు నిత్యం సాయంత్రం రంగు రంగుల పూలతో బతుకమ్మను పేరుస్తూ ఆటా పాటలతో మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడుతూ గౌరమ్మను కొలుస్తున్నారు.