కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో కళాశాల టియస్ కెసి, అప్గ్రేడ్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ డి ఎఫ్ సి, ఎస్ బ్యాంక్ బ్యాంకులో ఉద్యోగాల కొరకు మంగళవారం నిర్వహించిన ఉద్యోగ మేళాలో 42 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా కె. విజయ్ కుమార్ తెలిపారు. అకడమిక్ కో ఆర్డినేటర్ డా విశ్వప్రసాద్ మాట్లాడుతూ, నేటి యుగంలో మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొరకు కంపెనీలు విద్యార్థులు వద్దకే వచ్చి ఉద్యోగాల కొరకు ఎంపిక చేసుకోవడం శుభ సూచకమని పేర్కొన్నారు.