గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు- 2024 నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి అనుమతితో పంచాయతీ అధికారులు తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 535 గ్రామ పంచాయతీలలో 6, 36, 362 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3, 29, 787 మంది మహిళలు, 3, 06, 560 మంది పురుషులు ఓటర్లుగా నమోదయ్యారు. ఇతరులు 15 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఓటరు జాబితాలను విడుదల చేశారు.