వ్యక్తి దారుణ హత్య
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో శనివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన సిద్ధిరాం తాగిన మైకంలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో వాగ్వాదానికి దిగాడు. వారు అతడిపై కర్రతో దాడి చేయగా అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.